
తప్పెవరిది..శిక్ష ఎవరికి?
- ఇంజినీరింగ్ కౌన్సిల్‌పై నేడు ‘సాక్షి’ చర్చావేదిక
- వేదిక: సెనేట్‌హాల్, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ
- సమయం: ఉదయం 11 గంటలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలిం గ్‌లో భారీగా సీట్లు మిగిలిపోవడం, రెండో విడత కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎంసెట్ ఉత్తీర్ణత సాధించి, సీటు వచ్చే అవకాశం ఉన్నా తాజా పరిణామాలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు ‘సాక్షి’ ముందుకొచ్చింది.
ప్రస్తుత పరిస్థితులకు దారితీసిన కారణాలు-పరిష్కారాలపై, ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన విధానాలపై ‘సాక్షి’ చర్చా వేదికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు.
వక్తలు: ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర - వైస్‌చాన్సలర్ ఎస్వీయూనివర్సిటీ, ప్రొఫెసర్ సి.ఈశ్వరరెడ్డి- శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ డెరైక్టర్, ప్రొఫెసర్ ఆర్‌వీఎస్.సత్యనారాయణ- ఎస్వీయూ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ప్రొఫెసర్ జీఎన్.ప్రదీప్‌కుమార్-ఎస్వీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, డాక్టర్ హుమేరాఖాన్-ఎస్వీయూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం, ఎస్.రవీంద్రనాథ్ - పరిపాలనాధికారి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (సి.గొల్లపల్లె).