
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(27) ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని క్రిష్ణానగర్‌కు చెందిన దాసు, సరోజమ్మ దంపతుల రెండో కుమారుడైన వెంకటరత్నం రెండు నెలల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కోడుమూరు ఎక్సైజ్ కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న అతను శనివారంరాత్రి 11.30 గంటల సమయంలో తోటి కానిస్టేబుళ్లతో ఎప్పటిలానే మాట్లాడాడు. ఉదయం శవమై కనిపించాడు. కాగా, తమ కుమారుడు చాలా ధైర్యవంతుడని..
ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు లేవని వెంకటరత్నం తల్లి సరోజమ్మ తెలిపారు. అయితే సీఐ హిమబిందు తరచూ వేధిస్తున్నట్లు చెప్పేవాడని.. బయట చంపేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. ఘటనస్థలంలో మరొకరి సెల్‌ఫోన్ ఉం డటం.. ఎడమవైపు గడ్డం వద్ద రక్తపు మరకలు ఉండ టం హత్య చేశారనేందుకు బలం చేకూరుస్తోందన్నా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.