Venkataratnam
-
శ్రీకాకుళం మాజీ ఎస్పీకి మళ్లీ పోస్టింగ్!
అమరావతి: శ్రీకాకుళం మాజీ ఎస్పీ అడపా వెంకటరత్నంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. డెప్యూటేషన్‌పై ఏపీ ట్రాన్స్‌కోకు వెంకటరత్నంను బదిలీ చేసింది. ఏపీ ట్రాన్స్‌కో చీఫ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెంకటరత్నంను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెంకటరత్నంపై తీవ్రంగా రావడంతో ఎన్నికల కమిషన్ ఆయనను ఆకస్మికంగా విధుల నుంచి తప్పించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి వెంకటరత్నం ఖాళీగా ఉన్నారు. తనను అన్యాయంగా బదిలీ చేశారంటూ గతంలో ఈసీకి వెంకటరత్నం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి వెంకటరత్నంకు పోస్టింగ్ ఇచ్చారు. -
‘వైద్యులకు సెలవులు ఇవ్వొద్దు’
అనంతపురం సిటీ: వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరత్నం, ఆర్జేడీ దశరథ రామయ్యలు బుధవారం జిల్లాకు వచ్చారు. ముందుగా ప్రభుత్వాస్పత్రిలోని సూపరింటెండెంట్ జగన్నాథ్‌ను కలిసి వైద్య సేవల ందుతున్న తీరు.. మందుల కొరత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులను పరిశీలించారు. సాయంత్రం జిల్లా వైద్యారోగ్యశాఖాధి కారి వెంకటరమణను కలిసి జిల్లా వ్యాప్తంగా డెంగీతో పాటు విష జ్వరాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలోని వైద్య బృందం, సిబ్బందిలో ఎవరికి సెలవులు ఇవ్వొద్దని ఆదేశించారు. -
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం!
నెల్లూరు: సూళ్లూరుపేటలో జరిగిన జన్మభూమి సభలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. తొలుత సభను నిర్వహించడానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరత్నం వేదికపైకి వచ్చారు. అందుకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రొటోకాల్ పాటించాలని సంజీవయ్య అధికారులను ఆదేశించారు. దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. *** -
బాలికల్లో ప్రశ్నించే తత్వం అవసరం
రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం విజయవాడ : బాలికల్లో ప్రశ్నించే తత్వం ఉండాలని, అప్పుడే జీవితంలో ధైర్యంగా రాణించగలరని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. ఐద్వా 13వ మహాసభలను పురస్కరించుకుని ఐద్వా, సిద్ధార్థ మహిళా కళాశాల ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ‘బాలికలు- భద్రత’ అనే అంశంపై సదస్సు జరిగింది. సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి చనిపోయే వరకూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని, అసలు స్త్రీలకు భద్రత లేన ప్పుడు ఆ పథకాలు ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా మహిళలపై హింస, మోసాలు, భ్రూణ హత్యల గురించి వింటూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. డ్వాక్రా మహిళల విషయంలో అధికార యంత్రాంగ వివక్ష చూపారని ఆమె పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలగానే మిగిలిందని, అయితే 50 శాతం రిజర్వేషన్లు క ల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిసేధ చట్టం 1961లో అమలులోకి వచ్చినా, ఇప్పటికీ ఆ చట్టం కోమాలోనే ఉందన్నారు. 2008లో కట్నం లేకుండా చేసుకున్న వివాహాల వివరాలను చట్టపరంగా నమోదు చేసేవారని తెలిపారు. మంచి చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. విద్యార్థినులందరూ ఐకమత్యంతో మెలగాలని, నిర్భయంగా వేధింపులు ప్రతిఘటించాలని సూచించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా నగర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ స్త్రీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించి, పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమెన్స్ సెల్ కన్వీనర్ ఎస్.కల్పన, కె.ఉషారాణి, శైలజ పాల్గొన్నారు. -
21కి చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య
ఇంకా ఐదుగురి పరిస్థితి విషమం కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో మంగళవారం అర్ధరాత్రి మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరింది. సంఘటన జరిగిన జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వానరాశి వెంకటరత్నం (46) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం కాకినాడ అపోలోలో ఆరుగురు, ట్రస్ట్‌లో ఆరుగురు, సాయిసుధలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఐదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు వైద్యులుచెబుతున్నారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(27) ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని క్రిష్ణానగర్‌కు చెందిన దాసు, సరోజమ్మ దంపతుల రెండో కుమారుడైన వెంకటరత్నం రెండు నెలల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కోడుమూరు ఎక్సైజ్ కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న అతను శనివారంరాత్రి 11.30 గంటల సమయంలో తోటి కానిస్టేబుళ్లతో ఎప్పటిలానే మాట్లాడాడు. ఉదయం శవమై కనిపించాడు. కాగా, తమ కుమారుడు చాలా ధైర్యవంతుడని.. ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు లేవని వెంకటరత్నం తల్లి సరోజమ్మ తెలిపారు. అయితే సీఐ హిమబిందు తరచూ వేధిస్తున్నట్లు చెప్పేవాడని.. బయట చంపేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. ఘటనస్థలంలో మరొకరి సెల్‌ఫోన్ ఉం డటం.. ఎడమవైపు గడ్డం వద్ద రక్తపు మరకలు ఉండ టం హత్య చేశారనేందుకు బలం చేకూరుస్తోందన్నా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.