
ఎ.కొత్తపల్లిలో అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన కాలం చెల్లిన ఓఆర్‌ఎస్‌ఎల్ ప్యాకెట్లు
తొండంగి (తుని): స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కాలం చెల్లిన ఓఆర్‌ఎస్‌ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారని ఎ.కొత్తపల్లి గ్రామస్తులు ఆదివారం రాత్రి వాపోయారు. గ్రామంలో గొల్లపేట అంగన్‌వాడీ సెంటర్లో శనివారం అంగన్‌వాడీ కార్యకర్త కేంద్రంలో మహిళలకు ఓఆర్‌ఎస్‌ఎల్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయితే ఈ ప్యాకెట్లను పరిశీలించగా 2016లో తయారయ్యాయి. రెండు సంవత్సరాలు కాలపరిమితి దాటి తర్వాత వీటిని పంపిణీ చేస్తున్నట్టు కాలిబోయిన ఏడు కొండలు, తాటిపర్తి ప్రసాద్, కడారి శ్రీనులు గమనించారు.
దీనిపై ఉన్నతాధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పంపిణీ చేసిన ప్యాకెట్లను మహిళలు వినియోగించకుండా సేకరించామన్నారు. కాలం చెల్లిన ఓఆర్‌ఎస్‌ఎల్ ప్యాకెట్లు పసిపిల్లలకు, మహిళలకు పంపిణీ చేయడం వైద్యారోగ్య సిబ్బంది, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసువాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment