ఎక్సప్రెస్ స్పీడ్ లో పుష్కర ఏర్పాట్లు పూర్తి
{పయాణికులకు తూర్పుకోస్తా రైల్వే
{పత్యేక సదుపాయాలు
గోదావరి పుష్కరాల కోసం తూర్పు కోస్తా రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో ఊపందుకోనున్న పుష్కరాలకోసం రైల్వే సర్వసన్నద్ధమైంది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో విశాఖపట్నం, సింహాచలం, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లు వివరాలు వాల్తేరు రైల్వే గురువారం రాత్రి ప్రకటించింది.
- విశాఖపట్నం సిటీ
స్పెషల్ కౌంటర్లు
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం 8 జనరల్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. వాటితో బాటు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై మరో నాలుగు, జ్ఞానాపురం వైపు రెండు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో ప్రత్యేకంగా రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లకు మాత్రమే టికెట్లు జారీ చేస్తారు. మరో మూడు ఎనీ టైం వెండింగ్ మెషీన్‌లతో టికెట్లు జారీ చేయనున్నారు.
దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఒకే కౌంటర్ పని చేస్తోంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏటీవీఎం మెషీన్ మాత్రం రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటుంది.విజయనగరంలో ప్రస్తుతం రెండు కౌంటర్లున్నాయి. అదనంగా ఒక కౌంటర్‌ను ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ, తిరిగి రాత్రి 6 నుం చి 7 గంటల మధ్య అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరో రెండు ఏటీవీఎంలు పని చేస్తాయి.
హెల్ప్ డెస్క్‌లు
పుష్కరాల సందర్భంగా నిరంతరం పని చేసేలా విచారణ, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. విశాఖ స్టేషన్‌లో మూడు, సింహాచలం, దువ్వాడలలో చెరో ఒకటి వుంటాయి. రైల్వేస్టేషన్‌లో చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్‌ను ఈ ఏర్పాట్లకు ఇన్‌ఛార్జిగా నియమించారు. జ్ఞానాపురం, విశాఖ ప్రధాన ద్వారాల వద్ద 30 మంది ఉండేందుకు అనుకూలమైన షెడ్డులను నిర్మిస్తారు. జ్ఞానాపురం, మెయిన్ స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద సంచార టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వైద్య సదుపాయాలను అన్ని ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు చేశారు.
స్పెషల్ రైళ్లు...
హైదరాబాద్-విశాఖపట్నం(07706) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12, 16, 20, 24, తేదీల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖపట్నం-హైదరాబాద్(0775) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13, 17, 21, 25 తేదీల్లో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డొర్నకల్, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది.
హైదరాబాద్-శ్రీకాకుళం(07708) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14, 18, 22, 26, తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 7.20 గంటలకు బయల్దేరి 10.15 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది.
శ్రీకాకుళం-హైదరాబాద్(07707) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15, 19, 23, 27, తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి విశాఖకు సాయంత్రం 3.45 గంటలకు చేరుకుని తిరిగి 4.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డొర్నకల్, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది.
తిరుపతి-పార్వతీపురం(07709) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13, 17, 21, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 2.05 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు పార్వతీపురం చేరుతుంది.పార్వతీపురం-ధర్మవరం(07710) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14, 18, 22, 26 తేదీల్లో రాత్రి 6.45 గంటలకు బయల్దేరి విశాఖకు రాత్రి 10.35 గంటలకు చేరుకుని, తిరిగి 10.55 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4.25 గంటలకు ధర్మవరం చేరుతుంది. అనంతపూర్, గూటీ, ధొనే, నంద్యాల్, గిద్దలూర్, కుంభం, మార్కాపురం, దొనకొండ, వినుకొండ, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం , బొబ్బిలి, ధర్మవరం-పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది.
ధర్మవరం-విశాఖపట్నం (07712) ఎక్స్‌ప్రెస్ ఈనెల 15,19,23,27 తేదీల్లో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అనంతపూర్, గూటీ, ధొనే, నంద్యాల్, గిద్దలూర్, కుంభం, మార్కాపురం, దొనకొండ, వినుకొండ, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. ఈ రైల్లో 8 స్లీపర్ క్లాస్, 10 జనరల్ బోగీలు, 2 ఏసీ బోగీలు ఉంటాయి.
విశాఖపట్నం- తిరుపతి (07711) ఎక్స్‌ప్రెస్ ఈనెల 16, 20,24,28 తేదీల్లో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూటూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.
విజయవాడ-విశాఖపట్నం (07714) ఎక్స్‌ప్రెస్ ఈనెల 16,17,18,19, 23,24,25,26 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈరైల్లో 9 జనరల్ బోగీలు, 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 2 ఏసీ బోగీలుంటాయి. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్‌యాదవ్ తెలిపారు.