హిందూపురం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో రూ. 3లక్షల నకిలీ కరెన్సీని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న నలుగురు నిందితులను కూడా గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన సన్నాయప్ప, లక్ష్మన్న, రామాంజనేయులు, కర్ణాటకకు చెందిన ఆఫ్రోజ్లున్నారు.
వీరితో పాటు ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 3లక్షల నకిలీ కరెన్సీ రూ. 500ల నోట్ల రూపంలో ఉన్నాయి. నిందితులకు ఈ కరెన్సీ ఎక్కడ నుంచి వచ్చింది? వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
హిందూపురంలో నకిలీ కరెన్సీ
Published Thu, Aug 13 2015 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement