
కాళేశ్వరి కాంప్లెక్సులో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్ డీఎస్పీవిజయ్‌పాల్, ఇతర అధికారులు ఆంధ్రా ఆటో ఏజెన్సీలో దొరికిన నకిలీ స్పేర్ పార్ట్స్
విజయవాడ: ఆటోమొబైల్స్ షాపులపై గురువారం విజయవాడ విజిలెన్స్ అధికారుల బృందాలు దాడులు చేశారు. హీరో కంపెనీకి చెందిన నకిలీ స్పేర్‌పార్ట్స్‌ను అదే కంపెనీ పేరుతో లేబుల్స్, కవర్లు ముద్రించి విక్రయిస్తున్నారని కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ విభాగానికి చెందిన ఆరు బృందాలు ఆరు షాపులపై ఏకకాలంలో దాడులు చేశాయి. నాలుగు షాపుల్లో నకిలీ స్పేర్‌పార్ట్‌లు దొరికాయి. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు.
గవర్నర్‌పేట ఏరియాలోని కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో ఆం«ధ్రా ఆటో ఏజెన్సీలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ షాపులో సుమారు రూ. 10 లక్షల విలువైన నకిలీ స్పేర్‌పార్టులు దొరికాయి. అజిత్ సింగ్‌నగర్‌లో సాయి వైష్ణవి ఆటో మొబైల్ షాపులో నకిలీ పార్టులు గుర్తించారు. సుమారు రూ. 35వేల విలువైన నకిలీ పార్టులు స్వాధీనం చేసుకున్నారు. బీసెంట్ రోడ్డులోని జయలక్ష్మి ఆటోమొబైల్స్, గుడివాద వర్ణమాన్ ఆటోమొబైల్స్ షాపులోనూ నకిలీ వస్తువులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment