టీ బిల్లులో లోపాలున్నాయి: కేసీఆర్ | Falts in Telangana Bill, says K Chandra Sekhar rao | Sakshi
Sakshi News home page

టీ బిల్లులో లోపాలున్నాయి: కేసీఆర్

Published Sun, Mar 9 2014 6:36 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

టీ బిల్లులో లోపాలున్నాయి: కేసీఆర్ - Sakshi

టీ బిల్లులో లోపాలున్నాయి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరావు అన్నారు. ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల జాతరలో ఆయన పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే లోగోను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల జాతర తెలంగాణ ఐక్యతకు నిదర్శనమని అన్నారు.
జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత టీబిల్లులో అనేక లోపాలున్నాయని, కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో పోరాడి తెలంగాణకు ప్రత్యేక హోదాను తెచ్చుకుందామని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయనేది అవాస్తవమని, తమకు ఎవరిపైనా  వ్యతిరేకత లేదని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement