బనగానపల్లి (కర్నూలు): రెవెన్యూ అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బలరాములు (45) ఆన్‌లైన్‌లో తన పొలం వివరాల నమోదు కోసం మూడు రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
అయినా పని కాకపోవడంతో సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. అక్కడున్న వారు మంటలను ఆర్పివేసి అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న రైతు
Published Mon, Jul 13 2015 6:33 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement