రైతులు సుభిక్షంగా ఉండాలి
సోమశిల: రైతులు పంట కాలువను సద్వినియోగం చేసుకుని సుభిక్షంగా ఉండాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైతులకు సూచించారు. అనంతసాగరం మండలం బెడుసుపల్లి సమీపంలోని కేడీపల్లి పంట కాలువకు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పంట కాలువను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఐదు గ్రామాల పొలాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతులు మాట్లాడుతూ తమ సమస్యను ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్‌రెడ్డి తనదిగా భావించి దాదాపు 3,600 ఎకరాల ఆయకట్టు కలిగిన కాలువను అభివృద్ధి పథాన నడిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే సేవలు భేష్: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
రైతుల సమస్యలను తనవిగా భావించి పంట కాలువను అభివృద్ధి చేసేందుకు సొంత నిధులు వెచ్చించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి సేవలు అభినందనీయమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ప్రశంసించారు. పంట కాలువ నీటి విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పంట కాలువ నిరుపయోగంగా ఉండటాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారన్నారు. నేడు ఈ కాలువ ద్వారా ఐదు గ్రామాల పరిధిలో పొలాలు అభివృద్ధిలోకి రానున్నాయన్నారు. ఈ సందర్భంగా నాయకులను రైతులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కల్వకుంట వెంకటేశ్వర్లురెడ్డి, సంగం జెడ్పీటీసీ దేవసహాయం, తూమాటి దయాకర్‌రెడ్డి, అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, పోతల నరసింహులు, కరేటి పెంచలయ్య, చండ్రా ప్రసాద్‌నాయుడు, షేక్ మౌలా, దుగ్గిరెడ్డి రత్నారెడ్డి, షేక్ షబ్బీర్, కేతా రాఘవరెడ్డి, ఎస్దానీ, పాపుదీపు సుబ్బారెడ్డి, పాలపాటి నాగార్జునరెడ్డి, పెద్దిరెడ్డి హరికృష్ణారెడ్డి, బట్రెడ్డి చక్రధర్‌రెడ్డి, ఎద్దుల శ్రీనివాసులురెడ్డి, నారసింహారెడ్డి, సాగునీటి శాఖ డీఈ రవి, తహశీల్దార్ సోమ్లా బనావత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.