శంషాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుకునే సమయానికి వరదపాలైంది.కోతకు వచ్చిన వరి పంటలు, కల్లాల్లోని గింజలు తడిసి మండలంలోని కెబి.దొడ్డి, సుల్తాన్‌పల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. హెలెన్ తుపాను కారణంగా శని వారం ఎగువ భాగంలో భారీ వర్షం కురిసిం ది. దీంతో ఈసీవాగులోకి ఆదివారం తెల్లవారుజామున వరద నీరు చేరి చుట్టు పక్కల పొలాలను ముంచెత్తాయి. ధాన్యపు గింజలు, పంట మెద ళ్లు కొట్టుకుపోయాయి. కాశింబౌలికి చెందిన రైతు నవీన్‌రెడ్డి పొలంలోని 65 బస్తాల ధాన్యం, కె.బి.దొడ్డి రైతులు రుక్కమ్మ, విక్రమ్ మరి కొందరి పొలాల్లోని ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. రెండు గ్రామాల్లో 50 మందికి రైతులకు చెందిన సుమారు 50 ఎకరాల వరి, 15 ఎకరాల క్యారెట్, పూల పంటలు నీటమునిగాయి. వరి కోతల తర్వాత ధాన్యం బస్తాలను కొం దరు రైతులు పొలాల్లో భద్రపర్చారు. నీరు చేరడంతో బస్తాలు తడిసిపోయాయి.
నవాబుపేట: హెలెన్ తుపాను రైతులను కోలు కోని స్థితిలోకి నెట్టింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటపొలాల్లో పూర్తిగా నీళ్లు చేరాయి. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మూసీ వాగు పొంగిపొర్లింది. వందల ఎకరాల్లో పంటలను ముంచేసింది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు దగ్గర పొలాల్లో ఉన్న వ్యవసాయ పరికరాలు, కరెంటు మోటార్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. టమాట, ఉల్లి, ఇతర కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 500 ఎకరాలకుపైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
చేవెళ్ల: హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం ఉదయం నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షానికి మండలంలో పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చి పంటను తీసే దశలో ఉన్న పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పైలిన్ తుపానుతో చాలా వరకు నల్లబడిన పత్తిపంట ఈ తుపానుతో మరింత నష్టానికి గురైంది. ఇప్పటికే ధరరాక దిగులుగా ఉన్న రైతన్నకు కంటతడిపెట్టిస్తోంది. క్వింటాలుకు రూ.4వేల మద్దతు ధర కూడా రాక ఇబ్బందిపడుతున్న రైతన్నకు పత్తి నల్లబారడంతో మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్యారెట్, టమాట పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి కాసిన టమాటాలు నేలరాలిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో కురిసిన వడగళ్లవాన, నెలరోజుల క్రితం వచ్చిన పైలిన్ తుపాను, మరోసారి పడగ విప్పిన హెలెన్ తుపానుతో ఈ సంవత్సరమంతా నష్టాలతోనే గడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతును దెబ్బతీసిన ‘హెలెన్’ వర్షాలు
Published Mon, Nov 25 2013 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement