సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టుకుంటున్నారు. బుధవారం జిల్లాలోని రైతులు వైఎస్ జగన్‌ని కలిశారు. ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని పర్చూరు తీసుకువస్తే, తీవ్ర కరువుతో అల్లాడుతున్న పరిసర గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. ఈమేరకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలంటూ జననేతకు వినతి పత్రం ఇచ్చారు. దివంగత నేత వైఎస్‌ఆర్ హాయాంలో కృష్ణా నీటిని తీసుకురావడానికి రూ.70 లక్షలతో సర్వే చేయించారని, ఆయన మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని రైతులు విన్నవించుకున్నారు.
దిగుమతి తగ్గిపోయింది.. మద్దతు ధర లేదు
ఇంకొల్లు మండలంలోని మిర్చి , శెనగ రైతులు బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. మండలంతో పదివేల ఎకరాలలో మిర్చి, 30 వేల ఎకరాలలో శెనగ పండిస్తున్నామని తెలిపారు. సాగర్ నుంచి నీరు లేక సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. గతంలో ఎకరానికి 30 క్వింటాల్ దిగుబడి వస్తుండగా నీటి ఎద్దడితో ఇప్పుడు 15 క్వింటాళ్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మద్దతు ధర కూడా లేదని వాపోయారు. శనగ క్వింటాల్ ధర నాలుగు నుంచి అయిదు వేలు ఉంటోందని, మద్దతు ధర 6నుంచి 8వేలకు, మిర్చికి పదివేల రూపాయిలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతుల విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment