
పొలంలో కుమారుడితో కలిసి గుంటుక తోలుతున్న రైతు నరసింహారెడ్డి
మడకశిర రూరల్: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి తన 1.50 ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేసేవాడు. అయితే, నాలుగేళ్లుగా సాగుకు సరైన సమయంలో వర్షాలు పడక పంట చేతికందలేదు. అప్పులు మాత్రం పోగయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో తన కాడ్డెదులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. అదే క్రమంలో గ్రామంలోనే ప్రభుత్వం విత్తన కాయలు అందజేయడంతో త్వరగానే వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం వేరుశనగ చెట్లు ఏపుగా పెరిగాయి. కలుపు బాగా వచ్చేసింది. కాడెద్దులు లేకపోవడం.. ఉన్న వారు కలుపు తొలగించేందుకు గుంటకకు ఎక్కువ డబ్బులు అడుగుతుండడంతో ఇదిగో ఇలా తన కుమారుడు కృష్ణారెడ్డితో కలిసి కొన్ని రోజులుగా కలుపు తొలగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment