పత్తికొండ (కర్నూలు) : కన్నబిడ్డే అయినా ఆడపిల్ల కావడంతో ఆ తండ్రికి బరువైపోయింది. పుట్టిన నాలుగు రోజులకే ఆ పసిపాపను తిరిగిరాని లోకాలకు పంపించేశాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నెలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు... కనకదిన్నె గ్రామానికి చెందిన రామాంజనేయులు, మహేశ్వరి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కాగా రెండేళ్ల క్రితం మూడవ కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో రామాంజనేయులు ఆ పసిపాపను హత్య చేశాడు.
తాజాగా ఐదు రోజుల క్రితం మహేశ్వరి మరోసారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో రామాంజనేయులులోని రాక్షసత్వం మరోసారి నిద్రలేచింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న చిన్నారి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి ప్రాణాలు తీశాడు. భార్య మహేశ్వరి వారిస్తున్నా రామాంజనేయులు కరగలేదు. చిన్నారిని చంపేసి.. మృతదేహాన్ని గోనెసంచిలో వేస్కుని తీసుకెళ్లి తన పొలంలోని బావిలో పడేశాడు. దీనిపై మహేశ్వరి తన తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు గ్రామంలో సోమవారం పంచాయతీ పెట్టారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు
Published Mon, Jul 13 2015 3:37 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement