ఎరువుల అమ్మకాలపై విచారణ
విశాఖ రూరల్ : జిల్లాలో ఎరువుల అమ్మకాలపై నిఘా పెడతామని, తూకాలు సక్రమంగా లేని వాటిపై విచారణ జరిపిస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి మొత్తం 14 ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇందులో చోడవరం నుంచి వచ్చిన కాల్‌లో పసుపర్తి ఆదినారాయణ అండ్‌సన్స్ షాపులో తక్కువ తూకానికి ఎరువులు అమ్ముతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా దీనిపై విచారణ చేస్తామన్నారు.
విశాఖ మర్రిపాలెం నుంచి వచ్చిన కాల్‌లో గ్రూప్-4లో పీహెచ్‌సీ కోటా కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నామని, కాని ఉద్యోగం రాలేదని, ఇంకోసారి పరిశీలించాలని కోరారు. కశింకోటలో మద్రాసు సిమెంట్ ఫ్యాక్టరీవారి పొలాలకు నీరుపారే కాలువగట్టును ఆక్రమించుకొని రోడ్డు వేయ డం వల్ల కాలువ వెడల్పు తగ్గిపోయిందని, రైతులకు ఇబ్బంది కలుగుతుందని, చర్యలు తీసుకోవాలని కోరగా పరిశీలిస్తామని జేసీ చెప్పారు. తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన తదితర సమస్యలపై ఫోన్‌కాల్స్ వచ్చా యి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 127 దరఖాస్తులు
కలెక్టరేట్ సమావేశ మంది రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 127 దరఖాస్తులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో వెంకటేశ్వరరావు స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గృహాలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో అదనపు సంయుక్త కలెక్టర్ వై.నరసింహారావు, వికలాంగ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నర్సింహమూర్తి వికలాంగుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు.