రాష్ట్రపతి ముద్రపడే వరకు పోరాటం
Published Sun, Aug 18 2013 4:44 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే వరకు పోరాటం చేయాలని నాగర్‌కర్నూల్ ఎం పీ మందా జగన్నాథం పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గద్వాలలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించా రు. వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగు లు, కార్మికులు, జేఏసీ నాయకులు ర్యాలీ లో పాల్గొన్నారు. తెలంగాణ నినాదాలతో గద్వాల పట్టణం దద్దరిల్లింది. స్థానిక టీఎన్‌జీఓ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్‌చౌక్, రాజీవ్‌మార్గ్, గాంధీచౌక్, వైఎస్సార్ చౌరస్తా వరకు సాగింది.
ఈ సందర్భంగా ఎంపీ మందా మాట్లాడుతూ తెలంగాణ పై ప్రకటన చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వెంటనే పార్లమెంట్ లో బిల్లుపెట్టి త్వరగా రాష్ట్రప్రతి ఆమోదం ముద్ర వేయించాలని కోరారు. ప్రపంచం లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్రులపై ఎలాంటి దాడులు జరగలేదని, కానీ సీమాంధ్రులు తెలంగాణ ఉద్యోగులపై దా డులకు పాల్పడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడకుండానే సంబరాలు చేసుకోవ డం కాంగ్రెస్‌పార్టీకే చెల్లిందన్నారు. సీమాం ధ్ర ఉద్యోగులు తమకు భద్రత లేదని అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్నది డూ బ్లికేట్ ఉద్యమంగా అభివర్ణించారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ తెలంగాణదేనన్నారు. సీమాంధ్ర ఉద్యోగులపై ఎలాంటి కోపాలు లేవని, 610 జీఓ, ఇతర నిబంధనల ప్రకారమే ఉద్యోగుల పంపకాలు ఉంటాయన్నారు. ఇష్టమొచ్చి న వారు తెలంగాణలో ఉండొచ్చునన్నా రు. మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు మా ట్లాడుతూ సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతం అడుగడుగునా దోపిడీకి గురైం దన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించడం వల్లే కేంద్రం ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ, విద్యార్థి నాయకులు వీరభద్రప్ప, మధుసూదన్‌బాబు, గట్టు తిమ్మప్ప, రాజశేఖర్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మోనేష్, కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నందు, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.
Advertisement