ఏపీకి ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం
పులివెందుల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మా ట్లాడారు. పార్లమెంటు సాక్షిగా అప్ప టి పీఎం మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేశారన్నారు. ఇప్పటి ప్రధాని నరేం ద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రచార సభలలో ప్రజలకు హామీనిచ్చారని తెలిపారు.
మరోవైపు చంద్రబాబు రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటమార్చడం బాధాకరమన్నారు. టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కృషి చేయకుండా, ప్రత్యేక ప్యాకేజీవైపు మొగ్గు చూపడం దారుణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరి అని, ప్రత్యేక ప్యాకేజీవల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి ఉండదని పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేయడం బాబు నైజమని విమర్శిం చారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర్ర అవుతున్నా.. ఇప్పటివరకు పేద ప్రజలకు పక్కాగృహాలు కానీ, ఒక కొత్త రేషన్ కార్డు కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం తన మంత్రులతో జగన్‌పై ఎదురుదాడి చేయించడం హేయమైన చర్య గా అభివర్ణించారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైఎస్‌ఆర్‌పార్టీ అనేక ఆందోళనలు చేపట్టిందని.. ఈ నెల 26వ తేదీన గుంటూరు వేదికగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవి రెడ్డి శివశంకర్‌రెడ్డి, వేముల సాం బశివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.