
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో ధర్నా చేసి, ప్రజల ఆకాంక్షను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా నినాదానికి నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ఊపిరి పోశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా హోదా మాట వినిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్న చంద్రబాబుతో హోదా మన హక్కు అని అనిపించిన ఘనత వైఎస్ జగన్‌దే అన్నారు.
అవిశ్వాసానికి మద్దతివ్వండి
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించిందని, ఏప్రిల్ 6న రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఓట్లతో తాము ఎంపీలుగా ఎన్నికయ్యామని, వారి కోసం రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టనున్న అవిశ్వాసానికి మద్దతు తెలపాలని కోరారు.
అందుకే పులివెందులలో ఉన్నా
కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కోసం పులివెందులలో ఉండిపోయానని, రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్తానని అవినాష్‌రెడ్డి తెలిపారు. పులివెందుల ఘటనలో పూర్తి సంయమనంతో ఉన్నామని, అలానే ఉంటామని చెప్పారు. పోలీసులు వైఫల్యం వల్లే టీడీపీ నాయకులు రచ్చకు దిగారని, అమాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment