నమ్మలేకే.. అమ్మకం
సాక్షి, గుంటూరు :రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు రియల్ మాఫియూ గుప్పెట్లోకి వెళ్లిపోతున్నారుు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మలేక భయంతో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు తమ భూములు అమ్మేసుకుంటున్నారు. కొనుగోలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడకు చేరుకుంటున్నారు.
భూ సమీకరణ అనంతరం ఎకరాకు రూ. 25వేలు చొప్పున ఇస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలు, రుణ మాఫీ తరహాలోనే మాయ చేస్తే తమ బతుకులు ఏమిటనే భయంతో భూములు అమ్మేస్తున్నట్టు తుళ్లూరు మండలం దొండపాడు రైతులు తేల్చి చెబుతున్నారు.
రోజురోజుకు ధరలు పైపైకి...
ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తున్న రియల్ వ్యాపారులను చూసి మధ్యవర్తులు భూముల ధరలు పెంచుతున్నారు. రూ. 70 లక్షలు, రూ. కోటి, రూ. కోటి 30లక్షలు ఇలా రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
కొంత మంది రైతులు ఎకరా ధరను రూ. 80లక్షలుగా ఖరారు చేసుకొని అడ్వాన్సులు తీసుకున్నారు. భూములు మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు.
ఇలా అడ్వాన్స్ తీసుకొన్న రైతులు ధరలు మళ్లీ పెరిగాయంటూ రిజిస్టర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇచ్చిన అడ్వాన్సులను తిరిగి పార్టీలకు ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో అసలు వ్యక్తులు కనిపించడం లేదు. అంతా దళారుల కనుసన్నల్లోనే సాగుతున్నారుు.
రోడ్ల వెంట రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలుస్తున్నాయి. చివరకు పశువుల పాకలు సైతం రియల్ ఎస్టేట్ కార్యాలయాలుగా మారుస్తున్నారు.
తుళ్లూరులో పెద్దసంఖ్యలో మధ్యవర్తులు కనిపిస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. తుళ్లూరు ప్రాంత రోడ్లన్నీ కిక్కిరిసి పోతున్నాయి.
ఇదీ మార్కెట్ విలువ..తుళ్లూరు, శాఖమూరు, ఐనవోలులో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరా మార్కెట్ విలువ రూ. 4 లక్షలుగా ఉంది. దీనికి ఆరు శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
నెక్కల్లులో ఎకరా మార్కెట్ విలువ రూ. 3లక్షలు మాత్రమే.
లింగాయపాలెం,ఉద్దండ్రాయునిపాలెంలో మార్కెట్ విలువ రూ. 5లక్షలుగా ఉంది,
మంగళగిరి మండలంలో రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలుగా మార్కెట్ విలువ ఉంది.
రాయపూడిలో అత్యధికంగా రోడ్డువైపు ఉన్న భూముల్లో గరిష్టంగా ఎకరా మార్కెట్ విలువ రూ. 12 లక్షలుగా ఉంది.
మందడం, వెంకటపాలెం, బోరుపాలెంలో సగటున ఎకరా మార్కెట్ విలువ రూ. 6నుంచి రూ. 8 లక్షలుగా ఉంది.
నమ్మలేక ... భయంతో అమ్మేస్తున్నాం..
చంద్రబాబును నమ్మలేకే భయంతో నా భూమిని అమ్మేశాను. రుణమాఫీ మాదిరిగా ఉంటుందని భయపడ్డాను. నా ఎకరం పొలాన్ని నెలరోజుల కిందటనే రూ. 34 లక్షలకు అమ్మేశాను. ఇంకా నా ఆడపిల్లలకు సంబంధించి నాలుగు ఎకరాల పొలం ఉంది. దీన్నికూడా రాజధానిప్రాంతాన్ని ఇచ్చేందుకు ఇష్టం లేకే అమ్మేయాలనుకుంటున్నా. ఆడబ్బు దగ్గరపెట్టుకోవాలనే అభిప్రాయంతో ఉన్నా.
- ఎ.రామారావు, దొండపాడు, తుళ్లూరు మండలం
బేరాలు కుదరడం లేదండి.. మేం నలుగురం కలిసి భూముల అమ్మకాలు,కొనుగోలుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాం. వారం రోజుల్లో 45 ఎకరాల భూమిని అమ్మించాం. భూముల ధరలు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి 30 లక్షలకు పెరగడంతో అమ్మిన రైతులు ఇప్పుడు భూములు ఇవ్వబోమంటున్నారు. అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇటు రైతులకు, అటు వ్యాపారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నాం. - తాడికొండ మాధవరావు, తుళ్లూరు
రోడ్డు రవాణా భద్రత బిల్లును రద్దుచేయూలిఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య డిమాండ్
మంగళగిరి : ప్రమాదాలు నివారించాలనే సాకుతో ఆర్టీసీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోన్న రోడ్డు రవాణా భద్రతా బిల్లు- 2014ను రద్దుచేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య డిమాండ్‌చేశారు. బస్టాండ్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నూతన బిల్లు.. ఫెడరేషన్ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు, రా జ్యాంగానికి వ్యతిరేకంగా వుందన్నారు.
ఆర్టీసీపై రాష్ట్రప్రభుత్వాల హక్కును హరిస్తూ కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే కుట్రలోభాగమే ఈ బిల్లు అని అన్నా రు. బిల్లును వ్యతిరేకిస్తూ తిరుపతిలో డిసెంబరు 6,7తేదీల్లో జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి పులి సత్యనారాయణ, ఎ.గంగాధర్, సీఐటీయూ నేత జేవీ రాఘవులు, ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, డీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.