కడపలో భారీ అగ్నిప్రమాదం
Published Mon, Apr 3 2017 11:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
వైఎస్సార్ కడప: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ పరుపుల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దుకాణంలో పెద్ద ఎత్తున పరుపులు స్టాక్ ఉండటంతో.. మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement