ముద్దనూరు, న్యూస్‌లైన్: ముద్దనూరు మండలంలోని మంగపట్నంలో కిరోసిన్ స్టవ్‌తో వంటచేస్తున్న రాయపాటి బాలసుబ్బమ్మ(45)కు కిరోసిన్ ఒంటిపై పడి మంటలు వ్యాపించడంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించింది. భార్యను రక్షించడానికి ప్రయత్నించిన భర్త మాబాబు(52) తీవ్రగాయలపాలై మరణించాడు. స్థానిక ఏఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో బాలసుబ్బమ్మ కిరోసిన్ స్టవ్ పంపుకొడుతుండగా అందులోని కిరోసిన్ ఎగిసి పడి స్టవ్ నుంచి మంటలు వ్యాపించి ఆమెను చుట్టుముట్టాయి. భార్యను రక్షించడానికి ప్రయత్నించిన భర్త మాబాబు తీవ్రగాయాలపాలయ్యాడు. ఇద్దరిని 108వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ బాలసుబ్బమ్మ సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మర ణించింది. తీవ్రగాయాలపాలైన మాబాబును మెరుగైన చికిత్సకోసం కర్నూలుకు తరలిస్తుండగా సాయంత్రం మార్గమధ్యలో మరణించినట్లు, కేసు నమోదు చేసి విచారణచేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ...
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప సముదాయంలో నివసిస్తున్న కె.లక్ష్మిదేవి(35) చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఓ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేస్తున్న లక్ష్మిదేవి, భర్త రాజాలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి లక్ష్మిదేవి కి రోసిన్ స్టవ్ వెలిగించి తన భర్తకు ఆమ్లేట్ వేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె శరీరానికి నిప్పంటుకుంది. సంఘటన జరిగిన వెంటనే రిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయకుల నారాయణ తెలిపారు.
మంటలు అంటుకుని... భార్యభర్తలు మృత్యువాత
Published Tue, Feb 18 2014 3:19 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement