శ్రీకాకుళం : జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టెక్కలికి చెందిన తహశీల్దారు కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు, రికార్డులు దగ్దమయ్యాయి. వీటితో పాటు ఫర్నిచర్‌కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment