గుంటూరు: గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన గుంటూరు హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీపూజ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 103లో జరిగింది. వివరాల్లోకెళ్తే... భార్య భర్తలమని చెప్పి అద్దెకు దిగిన సానికొమ్ము వెంకట కొండారెడ్డి, కుమారి.. దొంగచాటుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
అక్కడికి వెళ్లి చూసేసరికి బయటి నుంచి సంప్రదాయబద్ధంగా కనిపించే ఇంట్లో వేరు వేరు ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్టు తేలింది. గురువారం అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన పోలీసులు వెంకట కొండారెడ్డి, కుమారితో పాటు ఓ యువతిని ఇద్దరు విటులను అదుపులో తీసుకున్నారు.
వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్ట్
Published Fri, Feb 6 2015 10:33 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement