సీఐల పదోన్నతుల్లో భాగంగా నియామకం
పోలీసు శాఖ మరింత బలోపేతం
శ్రీకాకుళం కైం: జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతమవుతోంది. పెరుగుతున్న అవసరాలను గుర్తించి జిల్లాకు ఐదు డీఎస్పీ పోస్టులను మంజూరు చేయగా.. సీఐల పదోన్నతుల్లో భాగంగా ఆ ఐదు పోస్టులకు అధికారులను కేటాయించారు. విశాఖ రేంజ్ పరిధిలో పలువురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు ఇస్తూ పోలీసుశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా ఐదుగురు డీఎస్పీలు నియమితులయ్యారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ)లో ఇప్పటికే ఒక డీఎస్పీ ఉండగా మరో డీఎస్పీని జిల్లాకు ఐదుగురు కొత్త డీఎస్పీలు కేటాయించారు. అలాగే డీసీఆర్‌బి, సీసీఎస్, ట్రాఫిక్. మహిళా పోలీసు స్టేషన్లకు కొత్తగా డీఎస్పీలను కేటాయించారు.
విశాఖపట్నం సిటీలో సీఐగా పనిచేస్తున్న సీహెచ్ వివేకానందను జిల్లా ఎస్బీ డీఎస్పీగా, గతంలో జేఆర్‌పురం సీఐగా పని చేసిన కె.వేణుగోపాలనాయుడుకు సీసీఎస్ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం టెక్కలి సీఐగా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావును ట్రాఫిక్ డీఎస్పీగా, సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావును మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా నియమించారు. ఇదిలా ఉండగా గతంలో శ్రీకాకుళం డీఎస్పీగా ఉంటూ రివర్షన్‌కు గురైన పి.శ్రీనివాసరావును మళ్లీ డీఎస్పీగా నియమించి డీసీఆర్‌బీకి కేటాయించారు.
జిల్లాకు ఐదుగురు కొత్త డీఎస్పీలు
Published Sat, Nov 8 2014 12:53 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement