రంగారెడ్డి జిల్లాలో ప్రవూదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఆరియూ
మృతులు మహారాష్ట్ర వాసులు
మహేశ్వరం, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా వుహేశ్వరం వుండలంలో శుక్రవారం తెల్లవారుజావుున జరిగిన రోడ్డు ప్రవూదంలో ఐదుగురు వుృతి చెందారు. తుక్కుగూడ, రావిర్యాల మధ్యలో ఔటర్‌పై ఆగి ఉన్న ఇసుక లారీని.. తిరుపతికి వెళ్తున్న వుహారాష్ట్ర వాసులు ప్రయూణిస్తున్న టాటా ఆరియూ వాహనం ఢీకొనడంతో ఈ ప్రవూదం జరిగింది. శంషాబాద్ ఏసీపీ భద్రేశ్వర్, పహడీషరీఫ్ సీఐ భాస్కర్‌రెడ్డి, క్షతగాత్రుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర బాంద్రా జిల్లా తిరోడా తాలుకా భూత్‌నాథ్ గ్రామానికి చెందిన దంపతులు యోగేందర్, విద్యా యోగేందర్ కట్రే (30) తమ బంధువులు భరత్ బగులై (58), పైరన్‌బాయి పట్లే (60), వచ్చాల్లా బాయి సురుగురే (55), దీనూ బాయి(60), ప్రభాబాయి, సుఖ్‌దేవ్, యోగేందర్ తిరుపతి వెళ్లేందుకు వుహారాష్ట్ర నుంచి గురువారం టయోటా ఆరియో వాహనం(ఎంహెచ్ 35వీ 1212)లో బయలుదేరారు.
ముంబై జాతీయ రహదారిలో వచ్చి పటాన్‌చెరు ఔటర్ రింగు రోడ్డు ఎక్కారు. వీరు శంషాబాద్‌లో దిగి బెంగళూరు హైవే మీదుగా వెళ్లాల్సి ఉండగా పొరపాటున ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా అలాగే ముందుకు 15 కిలోమీటర్ల దూరం వెళ్లారు. తుక్కుగూడ దగ్గర ఔటర్ దిగే వీలున్నా వీరు చూసుకోలేదు. ఈ క్రమంలో తుక్కుగూడ, రావిర్యాల మధ్యలో ఔటర్‌పై ఆగి ఉన్న ఇసుక లారీని వీరు ప్రయాణిస్తున్న టాటా ఆరియా వాహనం ఢీకొంది. దీంతో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో విద్యా యోగేందర్ కట్రే, భరత్ బగులై, పైరన్‌బాయి పట్లే, వచ్చాల్లా బాయి సురుగురే, దీనూ బాయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న డ్రైవర్ మనోజ్‌తోపాటు మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సాగర్ రింగు రోడ్డులోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. క్షతగాత్రుల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎపీఎంసీ చైర్మన్ యోగేందర్ ఉన్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఏసీపీ భద్రేశ్వర్, పహాడీషరీఫ్ పోలీసులు, తుక్కుగూడ, రావిర్యాల గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పొగమంచే ప్రాణాలు తీసిందా..?: శుక్రవారం తెల్లవారుజామున పొగమంచు బాగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. టాటా ఆరియా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో కూడా ప్రమాదం కారణమని భావిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపైసరైన సూచిక బోర్టులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.