‘స్విస్’ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు భంగం
అత్యంత కీలకమైన రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ సింబ్రిడ్జి, సెంబ్‌కార్బ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (సింగపూర్ కన్సార్టియం)ను ఎంపిక చేసిన తీరు అసంబద్ధంగా ఉందని తప్పుబట్టారు. స్విస్ చాలెంజ్ అంటే ఎవరూ పిలవకుండా ఒక పనిని మేము ఇంత మొత్తానికి చేస్తామంటూ ఏదైనా సంస్థ తమంతట తాముగా ప్రతిపాదన సమర్పించాలని, అయితే రాజధాని స్టార్టప్ ఏరియా మాస్టర్ డెవలపర్ ఎంపిక విషయంలో ఇలా జరగలేదని చెప్పారు. స్విస్ చాలెంజ్ విధానంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ప్రతిపాదనలు కోరనున్నట్లు ప్రభుత్వమే పత్రికా ప్రకటన ఇచ్చిందని, దీనికి అనుగుణంగా సింగపూర్ కంపెనీలు ప్రతిపాదనలు సమర్పించాయని, ఇది కచ్చితంగా స్విస్ ఛాలెంజ్ విధి విధానాలను వక్రీకరించి దొడ్డిదారిన కంపెనీలను తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే అని చెప్పారు.