మాజీ మంత్రి మారెప్పకు తప్పిన ప్రమాదం | former minister mareppa injured in road accident | Sakshi

మాజీ మంత్రి మారెప్పకు తప్పిన ప్రమాదం

Jul 15 2015 10:14 AM | Updated on Aug 30 2018 3:56 PM

మాజీ మంత్రి మారెప్పకు తప్పిన ప్రమాదం - Sakshi

మాజీ మంత్రి మారెప్పకు తప్పిన ప్రమాదం

మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మారెప్పకు ప్రాణాపాయం తప్పింది.

ఇన్నోవాలో కర్నూలు వెళ్తుండగా ఘటన
భూత్పూర్:  మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మారెప్పకు ప్రాణాపాయం తప్పింది. ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మారెప్ప హైదరాబాద్ నుంచి కర్నూలుకు తన సహచరులతో కలిసి ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా.. దివిటిపల్లి వద్దకు రాగానే ముందువెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో వేగంతో ఉన్న ఇన్నోవా కారు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. దీంతో మారెప్పకు స్వల్పగాయాలయ్యాయి.

అదే కారులో ప్రయాణిస్తున్న మారెప్ప సోదరుడు బాల జోజెప్ప, మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య, బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, వాహనడ్రైవర్ స్వరూప్‌లకు ఎలాంటి గాయాలు తగలలేదు. ప్రమాదం తప్పడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement