Mareppa
-
తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
మాజీ మంత్రి మారెప్పకు తప్పిన ప్రమాదం
ఇన్నోవాలో కర్నూలు వెళ్తుండగా ఘటన భూత్పూర్: మహబూబ్‌నగర్ మండలంలోని దివిటిపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మారెప్పకు ప్రాణాపాయం తప్పింది. ఎస్ఐ లకా్ష్మరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మారెప్ప హైదరాబాద్ నుంచి కర్నూలుకు తన సహచరులతో కలిసి ఇన్నోవా వాహనంలో వెళ్తుండగా.. దివిటిపల్లి వద్దకు రాగానే ముందువెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో వేగంతో ఉన్న ఇన్నోవా కారు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. దీంతో మారెప్పకు స్వల్పగాయాలయ్యాయి. అదే కారులో ప్రయాణిస్తున్న మారెప్ప సోదరుడు బాల జోజెప్ప, మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య, బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, వాహనడ్రైవర్ స్వరూప్‌లకు ఎలాంటి గాయాలు తగలలేదు. ప్రమాదం తప్పడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బతుకు బజారు
పింఛన్ తీసేశారు.. పోషణ భారమైంది ! ఓ అమ్మ ఆవేదన కలెక్టరేట్ చుట్టూ {పదక్షిణల కరుణించని అధికారులు మునిసిపల్ ఆఫీసులోనూ చుక్కెదుర కన్నీటి పర్యంతమైన బజారమ్మ ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు ఆమెకు నా అనే వారు ఎవరూ లేరు. ఉన్నదల్లా ఒక్కగానొక్క కుమారుడు, భర్త. కుమారుడికి మతిస్థిమితం లేదు. భర్త పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వారి బాగోగులు చూసుకోవడమే ఆమె పని. వృద్ధాప్యంలో శక్తినంతా కూడగట్టుకొని వారిని పోషిస్తోంది. అయితే ఆమెకు ఆసరాగా ఉన్న పింఛన్‌ను ప్రభుత్వం తీసేసింది. నిబంధనల పేరుతో ఆమెకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. తనకు రెండు కళ్లుగా ఉన్న భర్త, కుమారుని పోషణ కోసం ఆమె ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ‘పింఛన్ తీసేశారు.. ఆదుకోండి సారూ’ అంటూ ప్రాధేయపడినా కరుణించే అధికారులు కరువయ్యారు. కర్నూలు (జిల్లా పరిషత్) : ఆనందం ఐదింతలు అంటూ ఒక వైపు ప్రచారం చేస్తూనే మరో వైపు పేదలకున్న ఆసరాను ప్రభుత్వం తొలగించి వేస్తోంది. నెలనెలా వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లూరు ఎస్టేట్‌లోని శివప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బజారమ్మ ఈ కోవకే చెందుతుంది. ఈమె ఒక్కగానొక్క కుమారుడు ఆంజనేయులుకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. ఇప్పటికి 26 ఏళ్లు వచ్చినా అతనిలో మాత్రం మార్పులేదు. మాటలు రావు.. వినిపించవు, ఆకలని కూడా చెప్పలేడు. ఆమె భర్త మారెప్పదీ(62) అదే పరిస్థితి. పక్షవాతం వచ్చి 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. కుమారునితో సమానంగా భర్తకూ అన్ని సపర్యలూ చేయాల్సి వస్తోంది. వారి ఆకలిని తీర్చేందుకు ఇరుగు పొరుగు వారి సహాయాన్ని అర్థిస్తుంది. అది కుదరకపోతే వీధిలో భిక్షమెత్తుకుని వచ్చి భర్త, బిడ్డ కడుపు నింపుతోంది. అయితే ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెకు వృద్ధాప్య పింఛనూ, కుమారునికి వికలాంగుల పింఛనూ ప్రభుత్వం తీసేసింది. పింఛన్ పునరుద్ధరించాలని బిడ్డను ఎత్తుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మునిసిపల్ కమిషనర్‌ను కలిస్తే సమస్య పరిష్కారమవుతుందని జేసీ చెప్పగా గురువారం సాయంత్రం ఆమె తన కుమారున్ని ఎత్తుకుని మునిసిపల్కార్యాలయానికి వెళ్లింది. గంటకు పైగా మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరకు అడిషనల్ కమిషనర్ ప్రసాదశర్మను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. అయితే పింఛన్లు తీసేసేది తాము కాదని, డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాలంటూ వెనక్కి పంపించారు. దీంతో బజారమ్మ కన్నీటి పర్యంతమైంది. తనగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విలపించింది. ‘ ఈ బిడ్డను భుజాన వేసుకుని ఎక్కడికని తిరగను. ఉన్నోళ్లకు చానా మందికి పింఛన్లు ఇస్తారు...మాలాంటోళ్లవి తీసేశారు. వీడికి(కుమారునికి) వేలిముద్రలు పడవు. అందుకే ఆధార్ రాలేదు. జిల్లా అధికారులు కనికరించి తనకు న్యాయం చేయాలి’ అని విలేకరుల ఎదుట వేడుకుంది. ప్రతి రోజూ కుమారునికి, భర్త పోషణకు రూ.200లకు పైగా ఖర్చు అవుతుందని, దాతలు సహాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. -
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు: మారెప్ప
ఒంగోలు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మాజీమంత్రి మారెప్ప విమర్శించారు. కృత్రిమ ఉద్యమమైన తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రానికి మరింత నష్టం కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణవాదులంతా సోనియాగాంధీ వద్ద వాస్తవాలు దాచిపెట్టారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని కేంద్రం తప్పుచేసిందన్నారు. అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకుండా కేంద్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా రాష్ర్ట విభజన నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతగానితనం వల్లే అలా జరిగిందన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. చేతనైతే రైతుల రుణాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను రద్దుచేయాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ హయాంలో రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుని కష్టనష్టాల నుంచి వారిని గట్టెక్కించేవారని గుర్తుచేసుకున్నారు. సుమారు 13 వేలకోట్ల రూపాయల రైతుల రుణాలను వైఎస్ఆర్ రద్దుచేశారని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయసాధన కోసం, ఆయన మరణించిన సమయంలో తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకడుగు వేయలేదన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం ఎదురుతిరిగాడని, అందుకనే ఆయన్ను అన్యాయంగా జైలుపాలుచేసి కక్ష సాధించారని మారెప్ప మండిపడ్డారు. జగన్ భయంతోనే చివరకు రాష్ట్ర విభజనకు సైతం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికుట్రలు చేసినా జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఎవరు ఎదురుతిరిగినా సీబీఐని ఉసిగొలిపి కక్ష సాధించడం షరామామూలేందని మారెప్ప విమర్శించారు. చిరంజీవిని ప్రజలు ఆదరించరు... చిరంజీవి కొత్తపార్టీ పెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయని, ఆయన్ను నమ్మి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మారెప్ప స్పష్టం చేశారు. పీఆర్పీ పేరుతో ఆయన చేసిన మోసాన్ని ప్రజలు ఇంకా మరవలేదన్నారు. హైదరాబాద్‌ను రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి చేసుకున్నారని, దాన్ని ఒక ప్రాంతానికే కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. అదే జరిగితే సీమాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబునాయుడు నడుంబిగించారని విమర్శించారు. ఆయన మాటలు, చేతలు అలాగే ఉన్నాయన్నారు. 1975లో ఎస్టీ సబ్‌ప్లాన్, 1980లో ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు 30 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులను దారిమళ్లించారని మారెప్ప వెల్లడించారు. ప్రస్తుతం 13 వేల కోట్ల రూపాయలను సబ్ప్లాన్కోసం కేటాయించినందున ఎస్పీ, ఎస్టీలకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కోటి రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని నిబంధనలున్నా.. ఇప్పటి వరకు కనీసం 15 వేల రూపాయలు కూడా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాలేదని విమర్శించారు. కనీస సౌకర్యాలు లేని ఇంజినీరింగ్ కాలేజీలను గుర్తించి వాటికిచ్చిన అనుమతులు, గుర్తింపును వెంటనే రద్దుచేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ నాయకుడు దారా సాంబయ్య ఉన్నారు. -
'రాహుల్ ని ప్రధానిని చేయడానికే విభజన'
హైదరాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర విభజన చేయడానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన మారెప్ప కాంగ్రెస్-టీడీపీలు ఆడుతున్న డ్రామాను ఎండగట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానిని చేయడానికి తెలుగు జాతిని విడగొట్టడానికి యత్నిస్తుంటే, దానికి టీడీపీ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. -
వైఎస్సార్ సీపీ నేత మారెప్పతో సాక్షి వేదిక
-
జగన్‌కు బెయిల్ రావడం తథ్యం : మారెప్ప
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని మాజీ మంత్రి మారెప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10లోపు జగన్‌కు బెయిల్ ఖాయం అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్‌కు బెయిల్ తథ్యం అన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో మారెప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. -
పదవి కోసం కోట్ల పాకులాట: మారెప్ప
కర్నూలు : కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిభావంతమైన నాయకత్వంతో తెలుగు ప్రజల అభిమానం పొందిన ఆదర్శ నేతగా కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరు గడిస్తే ...ఆయన కుమారుడు కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి మాత్రం పదవి పట్టుకొని పాకులాడుతూ రాష్ట్ర విభజనకు కారణమవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం శోచనీయమని ఇప్పటికైనా మనసు మార్చుకొని రాజీనామా చేయాలని మారెప్ప డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
రాష్ట్ర ప్రజలకు అండగా వైస్ఆర్సిపి: జూపూడి
ఢిల్లీ: రాష్ట్ర ప్రజలందరికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు, సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మారెప్ప భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. వారు ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్‌లోనే స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరికి సమన్యాయం చేయాలని తమ పార్టీ నిర్ణయం అని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎదిరించినందుకే జగన్‌ను జైల్లో పెట్టారన్నారు. జగన్‌ను ఆదరించిన జనాన్ని విభజించి శిక్షించారని వారు పేర్కొన్నారు.