కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప విమర్శించారు.
హైదరాబాద్:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేసేందుకే రాష్ట్ర విభజన చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మారెప్ప విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్ర విభజన చేయడానికి పూనుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన మారెప్ప కాంగ్రెస్-టీడీపీలు ఆడుతున్న డ్రామాను ఎండగట్టారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానిని చేయడానికి తెలుగు జాతిని విడగొట్టడానికి యత్నిస్తుంటే, దానికి టీడీపీ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు.