కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని మాజీ మంత్రి మారెప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10లోపు జగన్‌కు బెయిల్ ఖాయం అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్‌కు బెయిల్ తథ్యం అన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో మారెప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.