
మనుబోలు: నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసే సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు సక్రమంగా అమలుపరచలేదన్నారు. నాలుగున్నరేళ్లు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మళ్లీ ప్రజలపై ప్రేమ కురిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ఒక్క ఉత్తరం రాసి ఉంటే దుగ్గరాజుపట్నం పోర్టు పూర్తయ్యేదన్నారు. ప్రైవేటు పోర్టులకు లబ్ధి చేకూర్చేందుకే దుగ్ఘరాజుపట్నానికి మోకాలడ్డారన్నారు. దేశంలోనే ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని జాతీయ మీడియా పేర్కొందన్నారు. ఎంపీ నిధుల నుంచి సుమారు రూ.4 కోట్లతో సర్వేపల్లి నియోజకవర్గంలో 91 పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తీసుకొస్తారన్నారు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశానికి హాజరైన టీడీపీ మాజీ నాయకులు సూరపనేని కిషోర్‌నాయుడు, చేరెడ్డి కోదండరామిరెడ్డి, కోసూరు ప్రసాద్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు.
ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చెందులూరు శ్రీనివాసులు, గోను దశయ్య, బొమ్మిరెడ్డి కోటేశ్వరరెడ్డి, దాసరి మహేంద్రవర్మ, భాస్కర్‌గౌడ్, కోటేశ్వరగౌడ్, హరనా«థ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రమేష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment