velagapalli varaprasad rao
-
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్‌లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
చంద్రబాబుకు గుణపాఠం తప్పదు
మనుబోలు: నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసే సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు సక్రమంగా అమలుపరచలేదన్నారు. నాలుగున్నరేళ్లు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మళ్లీ ప్రజలపై ప్రేమ కురిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ఒక్క ఉత్తరం రాసి ఉంటే దుగ్గరాజుపట్నం పోర్టు పూర్తయ్యేదన్నారు. ప్రైవేటు పోర్టులకు లబ్ధి చేకూర్చేందుకే దుగ్ఘరాజుపట్నానికి మోకాలడ్డారన్నారు. దేశంలోనే ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని జాతీయ మీడియా పేర్కొందన్నారు. ఎంపీ నిధుల నుంచి సుమారు రూ.4 కోట్లతో సర్వేపల్లి నియోజకవర్గంలో 91 పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం తీసుకొస్తారన్నారు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశానికి హాజరైన టీడీపీ మాజీ నాయకులు సూరపనేని కిషోర్‌నాయుడు, చేరెడ్డి కోదండరామిరెడ్డి, కోసూరు ప్రసాద్‌కు ఆయన సాదర స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, చిట్టమూరు అజయ్‌రెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చెందులూరు శ్రీనివాసులు, గోను దశయ్య, బొమ్మిరెడ్డి కోటేశ్వరరెడ్డి, దాసరి మహేంద్రవర్మ, భాస్కర్‌గౌడ్, కోటేశ్వరగౌడ్, హరనా«థ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, రమేష్ ఉన్నారు. -
చంద్రబాబు అసమర్థుడు
పెళ్లకూరు(నెల్లూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థుడని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు విమర్శించారు. వైఎస్సార్సీపీ పెళ్లకూరు మండల కన్వీనర్, పుల్లూరు సర్పంచ్ మారాబత్తిన సుధాకర్‌కు మంగళవారం పుల్లూరులో పదవీ విరమణ సన్మానసభ జరిగింది. ఇందులో వెలగపల్లి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి సీటు కోసం బాబు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి తెలుగు ప్రజలను మోసం చేశాడన్నారు. నాలుగన్నరేళ్లు బీజేపీతో కలిసుండి ఎన్నికలొస్తున్న తరుణంలో అన్న క్యాంటీన్ అంటూ మరోమారు ప్రజలను మోసం చేస్తున్న బాబుకు సిగ్గు లేదని దుయ్యబట్టారు. భారత చట్టానికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలను నియమించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దర్మార్గుడని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకుని తెలుగుజాతిని తలదించుకొనేలా చేశాడన్నారు. పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంటే అధికార టీడీపీ హంగులు, ఆర్భాటాలు ఎలా చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాభివృద్ధికి భరోసా అని స్పష్టం చేశారు. అనంతరం సుధాకర్‌ను స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి వారు ఘనంగా సన్మానించారు. -
మాట తప్పడమే చంద్రబాబు నైజం
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పడమే సీఎం చంద్రబాబు నైజంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాకాణి మాట్లాడుతూ బేషరతుగా రుణమాఫీ అని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారన్నారు. జిల్లాలో అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం 2,82,473 మంది రైతులకు గాను రూ.1,012.60 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారని గుర్తు చేశారు. అయితే మూడున్నరేళ్లలో మొదట విడతగా రూ.394.79 కోట్లు, రెండో విడతగా రూ.154.67 కోట్లు మాఫీ చేశారన్నారు. వారిలో కూడా ఇంకా కొంత మంది రైతులుకు రుణమాఫీ కాక పోవడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విధంగా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సొంత జిల్లాపై కనీసం కనికరం లేకుండా ఉన్నారన్నారు. ఏడు నెలల నుంచి సంగం బ్యారేజీ కాంట్రాక్ట్‌ర్‌కు బిల్లులు చెల్లించలేదన్నారు. ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డికి అల్లీపురంలో నకిలీ ఎరువుల తయారీ, ఉదయగిరిలో పసుపు కుంభకోణంలో దోచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ రైతులకు కావాల్సిన వాటిని అందించడంలో లేదని ఆరోపించారు. ప్రజలతరపున ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చుచేసుకునే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చలేడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 90 శాతం మంది రైతులు రుణాలు మాఫీకాక అల్లాడుతున్నారన్నారు. హైటెక్ రాజ ధాని అంటూ విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చలేదని ఆరోపించారు. 100 ఇళ్లు ఉన్న చోట ఐదు బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేదలకు అన్ని విధాలా మోసం చేస్తున్న చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబు తారన్నారు. సమావేశంలో కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటశేషయ్య, నాయకులు భాస్కర్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, సుధీర్ పాల్గొన్నారు. -
రుణమాఫీపై తొలి సంతకం చెయ్ ‘బాబూ’
ఏర్పేడు, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖ రరెడ్డి ముఖ్యమంత్రి అరుున వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అదే తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం తదితర హామీలపై తొలి సంతకం చేయూలని తిరుపతి ఎంపీగా గెలుపొందిన వెలగపల్లి వరప్రసాదరావు డిమాండ్ చేశారు. మడలంలోని పాపానాయుుడుపేట,మర్రివుంద, రావిళ్లవారికండ్రిగ, ఎండీపుత్తూరు, కందాడు, వుుసలిపేడు,మడిబాక, రాజులకండ్రిగ తదితర గ్రావూల్లో వుంగళవారం సాయుంత్రం ఆయన వై ఎస్సార్ సీపీ నాయుకులు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభివూనంతో ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో ప్రజ లే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించా రు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో సువర్ణయుుగం చూశావుని ఆయన తెలిపారు. అయితే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కరువు కాటకాలు చవిచూసినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ ఐదేళ్లకాలం కరువుకాటకాలు రాకుం డా కాపాడాలని భగవంతుని ప్రార్థిం చారు. ఎంపీ నిధుల నుంచి గ్రావూలను అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు, పార్టీ నాయుకులు, కార్యకర్తల కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రవుం లో వైఎస్సార్ సీపీ వుండల కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు, అర్జున్‌బాబు, నాగభూషణనాయుుడు, వుర్రివుంద, పాతవీరాపురం ఎంపీటీసీ సభ్యులు వలాలి, చెంబేటి వుునిరత్నంరెడ్డి, రో శయ్యు, దావుు యూదవ్, రహీం, వూస్ట ర్ జయురాం, సుధీర్, రవిరెడ్డి, వుునికృష్ణారెడ్డి, కందాటి ప్రభాకరరెడ్డి, గోపి యూదవ్, వునోహర్, వుునికృష్ణవునాయుుడు, సుందరనాయుుడు తదితరులు పాల్గొన్నారు. -
అవకాశమిస్తే అభివృద్ధిచేసి చూపిస్తా
ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని పుట్టినగడ్డకు మేలుచేయడమే లక్ష్యం ఉద్యోగాలు, ఇళ్లపేరుతో మోసం చేయడం తెలియదు తిరుపతి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌రావు తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ప్రజల కష్టాలు పూర్తిగా తెలిసినవాణ్ని, ఎన్నికల్లో గెలిపించి ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు అన్నారు. తిరుపతిలోని ఓ ప్రరుువేటు హోటల్లో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 33సంవత్సరాలుగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేశానని, 1983 నుంచి 2009వరకు కలెక్టర్‌గా పనిచేసి ప్రజల కష్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నానని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి వద్ద ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రజల కష్టాలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసుకున్నానన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని దాదాపు ఎనిమిది వందల గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నానని తెలిపారు. వెంకటగిరి ప్రాంతంలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభివృద్ధికి నోచుకోకుండా అనేక కాలనీలు దుర్భరస్థితిలో ఉన్నాయని చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే వాటి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకరరెడ్డి, ఎంపీగా తనను గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తిరుపతిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇళ్లున్నా పట్టాలు లేని వారికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. పుట్టినగడ్డకు మేలు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని, ప్రజాసేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. చింతామోహన్‌లాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలందరికీ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓట్లు కోసం మోసం చేయడం తనకు తెలియదని వరప్రసాద్ అన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు 30ఏళ్లుగా నమ్మి ఓట్లు వేసినందుకు చింతామోహన్ వారికి ఆవగింజంత అభివృద్ధి కూడా చేయలేదన్నారు. ఎంతసేపూ అంతర్జాతీయ విమానాశ్రయం, వరల్డ్‌క్లాస్ రైల్వే స్టేషన్, మూడు వందల పడకల ఆస్పత్రి, నేషనల్ క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేస్తానని ప్రజలను మోసంచేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఎంపీ అరుుతే ఎంత అభివృద్ధి చేయగలమనే విషయాన్ని ప్రజలకు తాను చేసి చూపిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి టీడీపీతో పాటు పూర్తి సహకారం అందించిన బీజేపీకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్రె డ్డి అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు ఉన్నత విద్య, ఇల్లు లేనివారికి సొంత ఇల్లు, నిరుద్యోగ యువతకు వడ్డీలేని రుణాలు, పొదుపు సంఘాల్లో మహిళా రుణాల మాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఐదు సంతకాలు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మన్నెం చంద్రశేఖర్ నాయుడు, టీ జనార్ధన్ పాల్గొన్నారు.