పులివెందుల : అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఆర్. తుమ్మలపల్లెలో సోమవారం ఉదయం జరిగింది. రామచంద్రారెడ్డి (50) అనే రైతు అప్పుల బాధ భరించలేక తనకున్న ఆరెకరాల భూమిని విక్రయించాడు. సోమవారం ఉదయం భూముల రిజిస్ట్రేషన్ ఉండగా ఆదివారం రాత్రి నుంచే అప్పులవాళ్ల ఒత్తిడి అధికమైంది. దాంతో మానసిక ఒత్తిడికి గురైన రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతణ్ణి పులివెందుల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రైతు రామచంద్రారెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.