జాదూ టీవీకి చెందిన నలుగురు జాదూల అరెస్ట్ | Four arrested for TV signal piracy | Sakshi
Sakshi News home page

జాదూ టీవీకి చెందిన నలుగురు జాదూల అరెస్ట్

Published Sun, Jun 29 2014 3:02 PM | Last Updated on Tue, Aug 27 2019 5:55 PM

Four arrested for TV signal piracy

హైదరాబాద్: కేబుల్ టీవీ సిగ్నల్స్ పైరసీ చేస్తున్న నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. టీవి సిగ్నల్ పైరసీ చేస్తున్నారంటూ మా టెలివిజన్ నెట్ వర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ వింగ్ బృందం సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో దాడులు నిర్వహించి పెర్ల్ టెక్నాలజీకి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
పెర్ల్ టెక్నాలజీకి సీఈఓ సుమిత్ అహుజా పరారీలో ఉండగా, వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఓ ఇంజినీర్, టెలీ కాలర్, వెబ్ డిజైనర్, ఉన్నారని పోలీసులు తెలిపారు. కేబుల్ టీవీ సిగ్నల్స్ ను ఇంటర్నెట్ సిగ్నల్స్ మార్చి అమెరికాలోని జాదూ టెలివిజన కు స్ట్రీమింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 
 
నెలవారి చెల్లింపులు చేయకుండాని కస్టమర్లు 115 చానెల్స్ చూడటానికి అవకాశముందని.. ఈ పైరసీ కారణంగా పెయిడ్ చానెల్స్ కు విపరీతంగా నష్టం వాటిల్లుతోందని పోలీసులు తెలిపారు. జాదూ టీవీ ఒక్కొ సెట్ ఆప్ బాక్స్ కు 300 డాలర్లు వసూలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. జాదూ టీవీ కార్యకలాపాలు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ తోపాటు మరో 15 దేశాల్లో కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement