అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి | four killed in ambulance crash | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి

Published Sun, Feb 14 2016 1:26 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి - Sakshi

అంబులెన్స్ ప్రమాదంలో నలుగురు మృతి

విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగురికి చేరింది. ఆదివారం మధ్యాహ్నం ఓ అంబులెన్స్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో 10 నెలల శిశువుతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

 

ఓ మృతదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి ఒడిశాలోని కటక్‌కు తీసుకెళుతున్నారు. యలమంచిలి సమీపంలోకి రాగానే అంబులెన్స్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పడిపోయింది. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సహా ఓ చిన్నారి మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement