శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: రీవాను తుపానుతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా పొట్టేపాలెం వద్ద వాగులో నలుగురు గ్రామస్థులు చిక్కుకున్నారు.
సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలని అధికారులకు ఆదేశించారు.