brook
-
వాగు అవతల రైతులు.. వాగు మధ్యలో విద్యార్థులు
తాడ్వాయి/ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): సాగు పనులకు వెళ్లిన 170 మంది కూలీలు వాగు అవతల చిక్కుకుపోగా..మరోచోట వరద నీటిలో విద్యార్థులతో కూడిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఈ రెండు ఘటనలు బుధవారం కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసు కున్నాయి. కామారెడ్డి జిల్లా సంతాయిపేటకి చెందిన 170 మంది రైతులు, కూలీలు బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు భీమేశ్వర వాగు అవతల ఉన్న పొలాలకు వెళ్లారు. మధ్యాహ్నం మండలంలోని దేమికలాన్, కరడ్‌పల్లి, నందివాడ, ఎండ్రియాల్ గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల నుంచి చిన్నచిన్న వాగులు పొంగి ప్రవహిస్తూ భీమేశ్వరవాగు లో చేరడంతో ఈ వాగు ఉధృతమైపోయింది. దీంతో కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలు సుకున్న గ్రామస్తులు...వారిని వాగు దాటించేందుకు చేసిన యత్నం విఫలమైంది. దీంతో పోలీసులు, కామా రెడ్డి ఫైర్‌సిబ్బంది వాగు వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో కూలీలను ఇవతలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో వారూ చిక్కుకుపోయారు. చివరకు రాత్రి 11–12 గంటల మధ్య సమయంలో కష్టమ్మీద 50 మందిని వాగు దాటించి తీసుకువచ్చారు. మిగతా వారిని వాగు ఇవతలికి చేర్చే యత్నాలు కొనసాగుతున్నాయి. వాగులో చిక్కుకున్న స్కూల్ బస్సు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నశీంపేట వద్ద చివ్వెంల–ముకుందాపురం రహదారిపై లోలెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వరదలో బుధవారం స్కూల్ బస్ చిక్కుకుపోయింది. ఉదయం ఆయా గ్రామాల నుంచి పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లే సమయంలో నశీంపేట వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రైవర్ ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు 24మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సును వరదలోకి తీసుకెళ్లాడు. మధ్యలోకి రాగానే బస్సు ఇంజన్ విఫలమై బస్సు కదలకుండా ఆగిపోయింది. ఎంతకూ బస్సు స్టార్ట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వెంటనే కార్యకర్తలను పురమాయించి స్థానికులతో కలసి బస్సును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. తదనంతరం పోలీసులు ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. -
10 ఫోర్లు.. 5 సిక్స్‌లు.. కేవలం 45 బంతుల్లోనే.. ఎవరీ బ్రూక్?
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రూక్ అధ్బుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 49 బంతుల్లో 102 పరుగులు చేసి బ్రూక్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఫఖర్ జమాన్, బ్రూక్ లహోర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగులు చేసిన జమాన్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్రూక్ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. బ్రూక్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫాహిమ్ ఆష్రఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లాహోర్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లాహోర్ బౌలర్లలో షాహీన్‌షా ఆఫ్రిది, రషీద్ ఖాన్, హరీష్ రఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
వాగులో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: రీవాను తుపానుతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా పొట్టేపాలెం వద్ద వాగులో నలుగురు గ్రామస్థులు చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలని అధికారులకు ఆదేశించారు.