శిక్షణ పూర్తిచేసుకున్న మొదటి బ్యాచ్ అభ్యర్థులు
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్‌సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్‌ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29(జూలై)న నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29(జూలై)న ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో పరీక్షకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు 150 మార్కులకు పరీక్ష జరుగును. కట్ ఆఫ్ 100 మార్కులుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంత నిరుపేద అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము. వంద మంది అభ్యర్థులను పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక చేసి వారికి ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టయిఫండ్‌తో పాటు మెటీరియల్‌ను అందజేస్తారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పించడమైనది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రతి నెలా 1000 రుపాయలు స్టయిఫండ్‌గా అందజేయుదురు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులు.
కట్ ఆఫ్ మార్కులు సాధించని అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని సంస్థ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి www.krishnamma.org వెబ్‌సైట్‌లో లేదా సంస్థ కార్యాలయంలో జూలై 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన మరో 50 మందికి అదనంగా భోజన వసతి, స్టయిఫండ్ కల్పిస్తామన్నారు.
రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఆగస్ట్ 5వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు ఆగస్ట్ 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168, 99850 36121 నెంబర్లను సంప్రదించగలరు.
Comments
Please login to add a commentAdd a comment