శ్రీకాకుళంలోని గుడి వీధిలో ఇంటి వద్దే రేషన్ ఇస్తున్న వలంటీర్
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న మూడో విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైన బుధవారం తొలిరోజు 21.55 లక్షల కుటుంబాలకు అందించినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.
► రేషన్ దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈసారి కూడా లబ్ధి్దదారులకు టైంస్లాట్‌తో కూడిన కూపన్లు పంపిణీ చేశారు.
► ప్రభుత్వ సూచనల మేరకు రేషన్ షాపుల వద్ద శానిటైజర్లను డీలర్లు అందుబాటులో ఉంచారు. సరుకుల కోసం వచ్చిన వారు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే రేషన్ డీలర్లు బయోమెట్రిక్ తీసుకున్నారు. బియ్యంతో పాటు కందిపప్పు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
► రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు 4,73,537 కుటుంబాలకు పోర్టబులిటీ ద్వారా సరుకులు అందించారు.
► వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు కూలడంతో కొన్ని చోట్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ–పాస్ మిషన్లు పని చేయకపోవడంతో ఆ రెండు జిల్లాల్లో పంపిణీ ఆలస్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment