రేపటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ | Freee Ration Good Distribution to Poor People From 20th July | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఉచిత సరుకుల పంపిణీ

Published Sun, Jul 19 2020 4:35 AM | Last Updated on Sun, Jul 19 2020 4:35 AM

Freee Ration Good Distribution to Poor People From 20th July - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు ఎనిమిదో విడత ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సరుకులను సిద్ధం చేసింది.  సోమవారం నుంచి లబ్ధిదారులు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా తీసుకోచ్చు. మండల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి అవసరమైన సరుకులను ఇప్పటికే రేషన్‌ షాపులకు తరలించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఐదు కిలోలు, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రమవుతున్నందున ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

భౌతిక దూరం తప్పనిసరి
► రేషన్‌ షాపుల వద్ద గుంపులుగా ఉండకూడదు. విడతల వారీగా రావాలి. 
► బయోమెట్రిక్‌ వేసే ముందు, ఆ తర్వాత చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. 
► శానిటైజర్, నీళ్లు, సబ్బును రేషన్‌ డీలర్లు అందుబాటులో ఉంచాలి. 
► సోమవారం నుంచి 28వ తేదీ వరకు రేషన్‌ షాపులను తెరవాలి. 
► ఈ దఫా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధిపొందనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement