పొదిలి : రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడడంలో తామే ముందుంటామని మండల వాసులు నిరూపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ జీవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది.
సుమారు 270 మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు ఆ మేరకు సిద్ధం కాకపోవడంతో 190 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారంటూ ఎంపీడీఓని అభినందించారు. జిల్లాలో ఎప్పుడూ ఇంత స్పందన రాలేదని బ్లడ్ బ్యాంకు డాక్టర్ పి.సత్యనారాయణ చెప్పారు. స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు ఎంపీడీఓ అభినందనలు తెలిపారు.
పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు షేక్ సుభాని, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ రక్తదాతలకు పండ్లు, రొట్టెలు, జ్యూస్, బిస్కట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలి, సీడీపీఓ రేచల్ సరళ, ఈఓఆర్‌డీ జి.నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, వైఎస్‌ఆర్ టీఎఫ్ జిల్లా నాయకులు సానికొమ్ము జగన్‌మోహనరెడ్డి, ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, రాచమల్ల వెంకటరామిరెడ్డి, కంచర్ల శ్రీనివాసులు, పులి వెంకటేశ్వరరెడ్డి, కె.చిన్న సోమయ్య పాల్గొన్నారు.
రక్తదానంలో ‘పొదిలి’ వాసులు ఆదర్శం
Published Wed, Aug 6 2014 3:43 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement