ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
హైదరాబాద్ : ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. మరోచరిత్ర లాంటి విజయం సినిమా వెనుక గణేష్ పాత్రో కృషి ఉందన్నారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, ఆత్మీయతలకు గణేష్ పాత్రో రచనలు అద్దం పట్టాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీనటులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ తదితరులు గణేష్ పాత్రో మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న గణేష్ పాత్రో సోమవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.