
తిరుపతిలో భారీగా గంజాయి పట్టివేత
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయిని రైల్వే పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి... అతడ్ని విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... అహ్మదాబాద్ నుంచి తిరుపతికి నాలుగు పెద్ద బాక్సులు పార్విల్లో వచ్చాయి.
పార్శిళ్లుగా వచ్చిన బాక్సులు తీసుకువెళ్లేందుకు వచ్చిన రమేష్ను... బాక్సుల్లో ఏమున్నాయని పోలీసులు ప్రశ్నించారు. దాంతో అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో బాక్సుల్లో గంజాయి ఉందని తెలిపాడు. దీంతో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేసి... అతడిని విచారిస్తున్నారు.