బాలసదన్ సూపరింటెండెంట్‌కు దుర్గాభవానిని అప్పగిస్తున్న చైల్డ్‌వెల్ఫేర్ చైర్మన్ మధులత
ఆకివీడు: ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్న బండారు దుర్గాభవాని అనే బాలికను స్థానిక బాలసదన్ సంరక్షణా కేంద్రంలో గురువారం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ చైర్మన్ మధులత చేర్పిం చారు. వేల్పూరుకు చెందిన బండారు పూర్ణిమ, శివ దంపతులకు నూకాంబిక, దుర్గాభవాని అనే ఇద్దరు కుమార్తెలు. తాపీ పనిచేస్తున్న తండ్రి మరణంతో నూకాంబిక, దుర్గాభవాని ఉండిలోని ఓ ఆర్కెస్ట్రాలో చేరి వచ్చిన సొమ్ములతో జీవనం సాగిస్తున్నారు.
అయితే పిల్లలిద్దరినీ తన ఇంటికి రావాలని తల్లి పూర్ణమ్మ ఒత్తిడి చేయగా అందుకు నూకాంబిక, దుర్గాభవాని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పూర్ణమ్మ ఫిర్యాదు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించామని, నూ కాంబిక, దుర్గాభవానిని విచారించామని మ ధులత చెప్పారు. మేజర్ అయిన నూకాంబిక ఇష్టప్రకారం ఆర్కెస్ట్రా యజమానుల వద్ద ఉండేలా, మైనర్‌గా ఉన్న దుర్గాభవానిని ఆమె ఇష్టం మేరకు బాలసదన్‌లో చేర్పించామన్నారు. అక్కడే ఉంచి చదువు చెప్పిస్తామన్నారు. దుర్గాభవానిని బాలసదన్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మికి అప్పగించామని మధులత వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment