ఆ జీఓను రద్దు చేయాల్సిందే | GO that must be canceled | Sakshi
Sakshi News home page

ఆ జీఓను రద్దు చేయాల్సిందే

Published Sat, Nov 29 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఆ జీఓను రద్దు చేయాల్సిందే

ఆ జీఓను రద్దు చేయాల్సిందే

కడప అర్బన్: 107 జీఓను వెంటనే రద్దు చేయాలని కడప రిమ్స్ జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు డిమాండ్ చేశారు. ఆయుధం లేని సైనికుడు, మౌలిక సదుపాయాలు లేని వైద్యుడు ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.

ఇందులో భాగంగా కడప రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు శుక్రవారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి కోటిరెడ్డి సర్కిల్‌కు ర్యాలీగా వచ్చారు. అక్కడ మానవ హారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వ జీఓకు వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ జూడాల అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు జూనియర్ డాక్టర్లు పనిచేసేందుకు  సిద్ధంగా ఉన్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుండే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్దేశాల ప్రకారం ఒక జూనియర్ డాక్టర్ ఁరెసిడెంట్* అని  పిలుచుకోవాలంటే  ్త ఎంసీఐలో రిజిస్ట్రేషన్ అయి  ఉండాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గనిర్దేశకాలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా బెదిరింపు ధోరణిలో బాండెండ్ లేబర్ కింద  పోస్టులను భర్తీ చేస్తోందన్నారు.  

21వ శతాబ్ధంలో కూడా పాము కాటుకు గురైన వ్యక్తి పాణాలను కోల్పోతున్నాడంటే  ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి 107 జీవోను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ జూనియర్ డాక్ట ర్స్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సురేష్‌బాబు, కార్యదర్శులు సాయి సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, సంధ్యారాణి, రాసిక్‌లతో పాటు, జూనియర్ డాక్టర్లు , హౌస్ సర్జన్‌లు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement