the Medical Council of India
-
రేపు వైద్యుల 'సత్యాగ్రహం'
అనంతపురం మెడికల్ : జాతీయ వైద్య కమిషన్‌కు వ్యతిరేకంగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా 'సత్యాగ్రహం' పేరుతో వైద్యులు నిరసన చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వయంప్రతిపత్తి ఉన్న భారతదేశ వైద్య మండలిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రేపు అన్ని పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. తమ ఆందోళనకు ప్రజలు సహకరించాలని కోరారు. -
గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంసీఐకి చెందిన నలుగురు వైద్యుల బృందంలో మెడికల్ కాలేజీలోని వసతిగృహాలు, ల్యాబోరేటరీలు, లైబ్రరీ, జిమ్, సెమినార్ హాళ్లతోపాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. పెంచిన మెడికల్ సీట్లకు అనుగుణంగా వసతులు, మౌళిక సదుపాయాలపై ఆరా తీశారు. కాలేజీ, ఆస్పత్రుల్లో ప్రాంగణాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయాలతోపాటు ఇన్షేషెంట్ వార్డులను పరిశీలించారు. ప్రతిరోజు జరిగే శస్త్రచికిత్సలు, జననాలు, మరణాలు, అవుట్ పేషెంట్లుకు చెందిన రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి, కళాశాలల్లోని వసతులు, మౌళిక సదుపాయాలపై ఎంసీఐ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్యులు, ట్యూటర్లు, సిబ్బంది కొరతపై కొంత మేర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటకీ రాష్ట్రాలు విడిపోయినా, వైద్యుల విభజన జరగలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వైద్యులు, సిబ్బంది తెలంగాణకు రానున్నారని, అలాగే ఇక్కడి నుంచి మరికొంతమంది ఏపీకి వెళ్ల్లనున్నారని, త్వరలోనే సమస్య అధిగమిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ అధికారులు సర్ధిచెప్పినట్లు తెలిసింది. మంగళవారం కూడా ఎంసీఐ తనిఖీలు కొనసాగుతాయని గాంధీ కాలేజీ ప్రిన్సిపాల్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ మహేష్చంద్రలు తెలిపారు. -
ఆ జీఓను రద్దు చేయాల్సిందే
కడప అర్బన్: 107 జీఓను వెంటనే రద్దు చేయాలని కడప రిమ్స్ జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు డిమాండ్ చేశారు. ఆయుధం లేని సైనికుడు, మౌలిక సదుపాయాలు లేని వైద్యుడు ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు శుక్రవారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి కోటిరెడ్డి సర్కిల్‌కు ర్యాలీగా వచ్చారు. అక్కడ మానవ హారంగా ఏర్పడ్డారు. ప్రభుత్వ జీఓకు వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ జూడాల అధ్యక్షుడు డాక్టర్ దొరబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు జూనియర్ డాక్టర్లు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుండే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్దేశాల ప్రకారం ఒక జూనియర్ డాక్టర్ ఁరెసిడెంట్* అని పిలుచుకోవాలంటే ్త ఎంసీఐలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గనిర్దేశకాలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా బెదిరింపు ధోరణిలో బాండెండ్ లేబర్ కింద పోస్టులను భర్తీ చేస్తోందన్నారు. 21వ శతాబ్ధంలో కూడా పాము కాటుకు గురైన వ్యక్తి పాణాలను కోల్పోతున్నాడంటే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి 107 జీవోను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ జూనియర్ డాక్ట ర్స్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సురేష్‌బాబు, కార్యదర్శులు సాయి సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, సంధ్యారాణి, రాసిక్లతో పాటు, జూనియర్ డాక్టర్లు , హౌస్ సర్జన్లు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.