పుష్కర మృతులు 22 మంది క్షతగాత్రులు ముగ్గురు
శ్రీకాకుళం సిటీ : రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆర్భాటంగా నిర్వహించిన పుష్కర యాత్ర ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ఈ వివరాల నమోదుపై ఇప్పుడు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పుష్కరాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పదిలక్షలు వంతున అందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ. రెండులక్షల వంతున అందిస్తామని ప్రకటించింది. పుష్కరఘటనలో తొలిరోజు మృతి చెందిన 27 మంది పూర్తి సమాచారాన్ని అందించాలని కేంద్రం ఆదేశంతో అక్కడి యంత్రాంగం కూడా ఇప్పటికే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో జిల్లా వాసులు తొమ్మిది మంది వరకు మృతి చెందారు. అనంతరం పుష్కరాలకు వె ళ్తూ వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. మూడు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు జిల్లాకు రావల్సి ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది.
పుష్కరాల మృతులు 22 మంది
గోదావరి పుష్కరాల్లో తొలిరోజున మృతిచెందిన వారు తొమ్మిది మంది కాగా, పుష్కరాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు 13 మంది వరకు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు మృతి చెందిన వారిలో రేగిడి ఆమదాలవలసకు చెందిన పైల పెంటన్నాయుడు, జడ్డు అప్పలనర్శమ్మ, పొట్నూరు అమరావతి (ఆమదాలవలస), కొత్తకోట కళావతి (సంతకవిటి), పొట్నూరు లక్ష్మి, బరాటం ప్రశాంత్ కుమార్ (శ్రీకాకుళం), లమ్మత తిరుపతమ్మ(సంతబొమ్మాళి), సాసుపల్లి ఆమ్మాయమ్య(భామిని), లచ్చుభుక్త పారమ్మ(వంగర) ఉన్నారు. వీరి కుటుంబీకులకు కేంద్రం నుంచి పరిహారం అందాల్సి ఉంది. ఇక పుష్కరాలకు వెళ్లే ప్రయత్నంలో, అక్కడి నుంచి తిరిగి వచ్చేటపుడు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన 13 మంది మృత్యువాత పడ్డారు. కర్రి సుభద్రమ్మ(గార), బోర ఎర్రప్పడు, బోర సరస్వతి(పోలాకి), పిట్టా అప్పలరాజు(జలుమూరు), పడాల ప్రసాదరావు, పడాల యశ్వంత్, పడాల షణ్ముఖం(పాలకొండ), కర్ర చంద్రరావు(రాజాం), పెంట శివకుమార్(పలాసా), పిన్నింటి సత్యనారాయణ( నందిగాం), కెల్లవలస రాజారావు(సారవకోట), మెండ అప్పన్న(వంగర), కూన అప్పలరాజు(సరుబుజ్జలి) ఉన్నారు. వీరికి రాష్ట్ర ్రపభుత్వం నుంచి పరిహారం అందాల్సి ఉంది.
క్షతగాత్రులు
పుష్కరాల రాకపోకల్లో జిల్లా వాసులు సుమారు 37 మంది వరకు గాయపడిన ట్లు తగిన సమాచారం అదికారుల వద్ద ఉండగా వారిలో అధికారికంగా ముగ్గురిని మాత్రమే ఈ జాబితాలో ఎంపిక చేశారు. అధికారులు ఎంపిక చేసిన వారిలో పాలకొండ కు చెందిన మొదల రమణమ్మ, లావేటి తవిటమ్మ, లావేటి యాసినిలు ఉన్నారు.
లెక్క తేలుస్తున్నారు
Published Sun, Jul 26 2015 12:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement