జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగ కర్తలు నిర్ణయించిన ముహూర్తం మేరకు గోదావరి పుష్కరాలు జులై 14 నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ... పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 1971 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అందులో భాగంగానే పురపాలక, పట్టణాభివద్ధి శాఖ నుంచి 898 పనులు, రోడ్లు, భవనాలు శాఖ ద్వారా 277, సాగునీరు, ఆయకట్టు ప్రాంతాల అభివద్ధి శాఖ నుంచి 244, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 72, దేవాదాయ శాఖ ద్వారా 441, ఏపీఈపీడీసీఎల్ శాఖ నుంచి 39 పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. వీటి కోసం రూ. 1162.11 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వ సహాయంగా రూ. 600 కోట్లు అడిగామన్నారు.