సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామ పంచాయతీలకు శుభవార్త. పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా వెలవెలబోయిన పంచాయతీలకు మంచిరోజులొచ్చాయి. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావడంతో అభివృద్ధి నిధుల విడుదలకు కేంద్రం పచ్చజెండా ఊపిం ది పంచాయతీలకు రావాల్సిన 13వ ఆర్థిక సంఘం (టీఎఫ్‌సీ) నిధులతోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నిధులు మంజూరు చేసింది. దీంతో జిల్లాకు రూ.22.8 కోట్లు విడుదలయ్యాయి. రెండేళ్లుగా గల్లాపెట్టె ఖాళీకావడంతో అభివృద్ధి కుంటుపడింది. తాజాగా నిధుల మంజూరు ఊరటనివ్వనుంది.
త్వరలో ఖాతాల్లోకి..
టీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ నిధులు పంచాయతీ శాఖ, జిల్లా పరిషత్‌కు వేర్వేరుగా విడుదలయ్యాయి. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.11.79 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.3.86 కోట్లు జిల్లా పంచాయతీ శాఖకు విడుదలయ్యాయి. అదేవిధంగా జిల్లా పరిషత్ కు 13వ ఆర్థిక సంఘం ద్వారా రూ.5.07కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా రూ. 2.08 కోట్లు విడుదలయ్యా యి. జిల్లా పరిషత్‌కు వచ్చిన నిధులతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో భాగంగా చేపట్టే పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ నిధులను గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా పంచాయతీ శాఖకు విడుదలైన నిధులను మాత్రం నేరుగా పంచాయతీలకే ఇవ్వనున్నారు. ఇందుకుగాను పంచాయతీల వారీగా ఏ మేరకు నిధులివ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు కే టాయిస్తామని జిల్లా పంచాయతీ శాఖ అధికారి వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
నిధుల వరద
Published Fri, Nov 1 2013 12:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement