కామారెడ్డి, న్యూస్‌లైన్: పాఠశాలలలో తాగునీటి సమస్య సంవత్సరాలుగా ఉన్నా మధ్యాహ్న భోజన పథకం వచ్చిన తరువాత తీవ్రంగా మారింది. అన్నం తిన్న తరువాత విద్యార్థులు నీళ్లు తాగడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు ప్రభుత్వాలు చె బుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. బెంచీలు, ఫ్యాన్లు ఏమో గాని కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని బడులు ఎన్నో ఉన్నాయి. తాగునీటి వసతులు కల్పించేందుకం టూ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
నిర్వహణ లేకనే
జిల్లాలో సగానికి పైగా పాఠశాలలలో తాగునీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1,594 ప్రాథమిక పాఠశాలలలో 99,921 మంది, 282 ప్రాథమికోన్నత పాఠశాలలలో 29,646 మంది, 509 ఉన్నత పాఠశాలలలో (36 కస్తూర్బా స్కూళ్లతో కలిపి) 1,22,529 మంది చదువుతున్నారు. మొత్తంగా 2,385 పాఠశాలలలో 2,52,145 మంది చదువుతున్నారు. వీరికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన జలమణి పథకం ద్వారా జిల్లాలో కేవలం 143 పాఠశాలలలో మాత్రమే సౌకర్యాన్ని కల్పించా రు. చాలా చోట్ల అవి కూడా పనిచేయకుండా మూలనపడ్డాయి. 2,360 పాఠశాలలకుగాను వెయ్యికి పైగా పాఠశాలలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
కొన్ని చోట్ల బోరు, మోటార్లు, నీటి ట్యాంకులు ఉన్నా సరైన నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరి కొన్ని చోట్ల నీటి ట్యాంకులు ఉన్నా పని చేయ డం లేదు. ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసి నా, వాటికి నీటినందించే సిస్టం లేక వృథాగా ఉంటున్నాయి. నీటి వసతి ఉన్న చోటనే, అవసరం లేకున్నా బోర్లు తవ్వించడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. అదే సమస్య ఉన్నచోట మాత్రం పట్టించుకునేవారు ఉండరని పలువురు విద్యాభిమానులు విమర్శిస్తున్నా రు. ఇప్పటికైనా నీటి సమస్య ఉన్న బడులను గుర్తించి సమస్య పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు.
నీళ్లు లేక చానా ఇబ్బంది పడుతున్నం
స్కూల్‌లో బోరు చెడిపోయింది. ఎన్నో రోజులుగా నీళ్లు లేవు. టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే చానా ఇబ్బంది పడుతున్నం. బోరును మరమ్మతు చేయించి మా ఇబ్బందిని తొలగించాలి. అధికారులు దృష్టి సారించాలి
-స్వప్న, ఏడో తరగతి, తిర్మన్‌పల్లి, సదాశివనగర్ మండలం
పళ్లాలు కూడా కడుక్కోలేకపోతున్నాం
అన్నం తిన్న తరువాత పళ్లాలు కడుక్కోవడం ఇబ్బంది అవుతోంది. బడికి దగ్గరలో ఉన్న మోటారు కరెంటు ఉంటేనే నడుస్తుంది. లేకుంటే కష్టమే. ఇళ్ల నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిందే. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి.
-రమేశ్, ఏడో తరగతి, తిర్మన్‌పల్లి, సదాశివనగర్ మండలం
చదువులమ్మకు వెక్కిళ్లు
Published Tue, Dec 24 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement